జిల్లాలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయకుంటే
— ఆమరణ నిరాహార దీక్ష చేస్తా
— జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్

మన సాక్షి గొంతుక ప్రతినిధి/జనగామ:
జనగామ పట్టణంలోని స్థానిక ఏరియా ఆసుపత్రిలోని పేద ప్రజలకు సిటీ స్కాన్ సేవలను ఏర్పాటు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం అని జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ అన్నారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి కి మూడు నియోజకవర్గాల నుండి నిరుపేద ప్రజలు అనారోగ్యం నుండి ఆరోగ్యవంతులు కావడం కోసం వస్తుంటారు.ఇక్కడ సిటీ స్కానింగ్ సౌకర్యం లేక ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు పంపిస్తూ రోగులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.స్థానిక ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్ కి అనేకసార్లు వినతి ఇవ్వడం జరిగింది.అలాగే నిరసన కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది.ఎంత చెప్పినా సిటి స్కానింగ్ ఆచరణ లోకి రావడం లేదని,ఇప్పటికైనా జనగామ జిల్లా కలెక్టర్ జనగామ ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే స్పందించి ఏరియా ఆసుపత్రిలో సిటి స్కానింగ్ సేవలు అందించాలి.లేనిపక్షంలో పేద ప్రజల కోసం రోగుల కోసం జనగామ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంతెన మణికుమార్ అను నేను ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధం అని అన్నారు.ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించాం.ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది.గత 5 సంవత్సరాల నుండి జనగామ జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సేవలు జరగడం లేదు అనే విషయాన్ని,అధికారులు గ్రహించాలని,ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని సిటి స్కాన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నానన్నారు.

