రేపు జనగామలో ధర్నా
పాల్గొని విజయవంతం చేయండి

బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి
మన సాక్షి గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ జిల్లా కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు జరిగే ధర్నాకు బచ్చన్నపేట మండలం నుండి అధిక సంఖ్యలో రైతులు ,పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని బచ్చన్నపేట బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన ద్వారా మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, గురువారం రోజున జనగామ ఎమ్మెల్యే డా. పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు జనగామ చౌరస్తా , దగ్గర ఉదయం 11.00 కి ధర్నా కార్యక్రమానికి, బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు ,ఎంపీటీసీలు, పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు,పార్టీ, మాజీ ప్రతినిధులు, మండల యువజన నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ,కార్యకర్తలు తదితరులు అందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

